మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గంలో రుణం కట్టాలని రైతుకు బ్యాంకు అధికారుల వేధింపులు
మందు తాగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రైతు
నల్గొండ జిల్లా కనగల్లు మండలం జీ యడవల్లి గ్రామంలో రైతు గౌని వెంకన్నకు కో-ఆపరేటివ్ బ్యాంకులో రూ.1,60,000 రుణం ఉంది
ఈ రుణం మాఫీ అవ్వలేదు.. ఈ రుణాన్ని కట్టాలని బ్యాంకు అధికారులు 7 రోజుల క్రితం రైతు భూమిలో జెండాలు పాతారు
మళ్ళీ ఈ రోజు వచ్చి రుణం కట్టకుంటే ఊరిలో డప్పు సాటు వేస్తామని, పొలాన్ని స్వాధీనం చేసుకుంటామని వేధించారు
బ్యాంకు అధికారుల వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన రైతు వెంకన్న వరి చెనుకు కొట్టే పురుగుల మందు తాగాడు
కుటుంబసభ్యులు రైతును ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది…..