మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన.. కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మార్గరెట్ థాచర్ కోట్‌ను పోస్టుతో జతపరిచారు.దిగజారి మాట్లాడడం మంచిది కాదు: సునీతా లక్ష్మారెడ్డి.బాధ్యతగల మంత్రిగా దిగజారి మాట్లాడడం మంచిది కాదు. కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్‌ను ఒక మహిళగా ఖండించాం. కానీ, ఇవాళ సినీ పరిశ్రమలో ఉన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఒక మహిళగా మరో మహిళను కించపరిచేలా మాట్లాడడం బాధాకరం. తనపై ఎవరో ట్రోల్ చేస్తే కేటీఆర్‌కు ఆపాదించడం, వ్యక్తిగతంగా దూషించడం సరైంది కాదు. సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని కామెంట్ చేసినప్పుడు తాము మహిళలమన్న విషయాన్ని కొండా సురేఖ మరిచారా’’ అని ప్రశ్నించారు.పరువు నష్టం దావా వేస్తాం: సత్యవతి రాథోడ్.మంత్రి కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి. లేదంటే పరువునష్టం దావా వేస్తాం. భారాసకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కేటీఆర్‌పై సురేఖ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మహిళా మంత్రులను అడ్డం పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. సినీ పరిశ్రమను కించపరిచే విధంగా కొండా సురేఖ మాట్లాడారు’’ అని ఘాటుగా స్పందించారు.ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం: మాజీ ఎంపీ మాలోత్ కవిత.కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల మహిళగా సిగ్గుపడుతున్నా. రాష్ట్ర మంత్రి అన్న స్థాయిని మర్చిపోయి ఆమె మాట్లాడుతున్నారు. వారి నోళ్లను యాసిడ్‌తో శుభ్రం చేయాలి. కేటీఆర్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం. హైడ్రాతో పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్‌ను కాపాడుకోవడం కోసమే కొండా సురేఖ, సీతక్కతో మాట్లాడిస్తున్నారు’’ అని అన్నారు.