బీసీ రిజర్వేషన్ల పోరుకు ఢిల్లీకి చేరిన మంత్రి కొండా సురేఖ
సురేఖ నేతృత్వంలో పెద్ద ఎత్తున హస్తినాకొచ్చిన ఓరుగల్లు బీసీలు
బీసీ రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటమేనని స్పష్టీకరణ
ఢిల్లీ..బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధనకి జరుగుతున్న పోరాటానికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, మంత్రి సురేఖ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఓరుగల్లుకు చెందిన బీసీలు దేశ రాజధాని హస్తినాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… బీసీలకు రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటమేన డిమాండ్ చేశారు. బుధవారం బీసీ రిజర్వేషన్ల సాధనకై జంతర్‌మంతర్‌లో ధర్నా జరగనున్న నేపథ్యంలో… రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు ఢిల్లీకి చేరకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు – విద్యా, ఉపాధి రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంట్‌లో ఆమోదించాలని కోరుతూ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఇటీవల ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఢిల్లీ జంతర్‌మంతర్‌లో బుధవారం మహాధర్నా చేపట్టనున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కుల గణన చేపడతామని హామీ ఇవ్వగా, ఆయన ఆశయం నేరవేర్చేందుకు తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. రిజర్వేషన్లు సాధించేవరకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సర్కారు మీద తాము పోరాటం చేస్తామన్నారు.