Site icon PRASHNA AYUDHAM

బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు..

బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు..

 బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. కవిత కోసం బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందాలు జరిగాయని.. అందుకే ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారన్నారు. గురువారం నాడు గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మంత్రి కొండా సురేఖ.. బీఆర్ఎస్, బీజేపీలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

కొండా సురేఖ కామెంట్స్..గజ్వేల్ ప్రజలు అనుకుంటే ఏదైనా సాధిస్తారని నమ్మకం ఉంది. మెదక్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్.. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుంది. ఎంపీలుగా బీజేపీని గెలిపిస్తామని, కవితని వదిలిపెట్టాలని ముందే అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నారు. ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలా అని మేము చూస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజలను తప్పు దారి పట్టిస్తోంది. సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు, రాతలు రాపిస్తూ కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షం ఇంతవరకు నియోజకవర్గంలో కానీ, అసెంబ్లీలో కానీ అడుగుపెట్టలేదు. గజ్వేల్ ఎమ్మెల్యే ఉన్నాడా లేడా అనేది ప్రశ్నగా ఉంది. కేసీఆర్ కనపడట్లేదు అని పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు ఇవ్వాలి. కేసీఆర్‌ను పక్కన పెట్టి.. ప్రజా సొమ్మును దోచుకొని.. ప్రజలలో బీఆర్ఎస్‌పై నమ్మకం పోయేలా చేసింది కేటీఆర్. మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం కేటీఆర్. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి కానీ అడ్డుపడితే ఊరుకునేది లేదు.’ అని అంటూ విపక్షాలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి.. కేపి

Exit mobile version