జనసేన ఆవిర్భావ సభ భద్రత ఏర్పాట్లపై మంత్రి మనోహర్ సమీక్ష

*జనసేన ఆవిర్భావ సభ భద్రత ఏర్పాట్లపై మంత్రి మనోహర్ సమీక్ష*

*పిఠాపురం:*

పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా ఈనెల 14వ తేదీన జరుగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. చిత్రాడ వద్ద సభాస్థలిని మంత్రి పరిశీలించారు. సభకు తరలివచ్చే లక్షలాదిమంది కార్యకర్తలకు, అభిమానులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపులు, నిర్దేశిత పార్కింగ్ స్థలానికి వాహనాలు తేలికగా చేరుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ చేస్తున్న ఏర్పాట్లను అధికారులకు తెలియజేశారు. అనంతరం ప్రధాన వేదిక, డీ జోన్, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ, మీడియా గ్యాలరీ, విఐపి ల గ్యాలరీలను పరిశీలించారు. సభ ప్రాంగణంలోనూ, హైవే వెంబడి సీసీ కెమెరాలు ఏర్పాటుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, ఏ ఎస్ పి మనీష్ దేవరాజ్ పాటిల్, పెద్దాపురం డి.ఎస్.పి శ్రీహరి రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment