వాహన తనిఖీలు చేపట్టిన ఎస్ఐ రాజ్ కుమార్

చేపట్టిన

Headlines:

  1. అట్టహాసంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కొత్తగూడెంలో
  2. జనహృదయనేతగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సేవలను ప్రజలు కీర్తిస్తున్నారు
  3. ప్రజల ఆదరణ పొందిన మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు సుజాతనగర్ లో

ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో వాహన తనిఖీలు చేపట్టిన ఎస్ఐ రాజ్ కుమార్…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో పెండింగ్ చలానాలు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీలు చేపట్టిన ఎస్ఐ రాజకుమార్.

ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడుతూ మీ వాహనాలకు పెండింగ్లో ఉన్న చలానాలు కట్టి మందు తాగి డ్రైవ్ చేయొద్దని ఒకవేళ మందు తాగి డ్రైవింగ్ చేస్తే జరగరానిది, ఏదైనా జరిగితే, మీ కుటుంబ సభ్యులకు దిక్కెవురని, ఆలోచించి యువత, వాహనాలు నడపాలి, కంపల్సరీ హెల్మెట్ ధరించాలి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి మీ వాహనాలకు కాగితాలన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోవాలి, యువత మద్యానికి, బానిసలు కావద్దని మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని మీ తల్లిదండ్రుల కలలను నిజం చెయ్యండి యువతకు సందేశం ఇచ్చారు, అలాగే తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తే వచ్చి రాని డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కావున మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచించారు ఎస్ఐ రాజ్ కుమార్…

ఈ కార్యక్రమంలో ఈ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ పోలీస్ సిబ్బంది స్థానిక యువత పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now