అట్టహాసంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు

మంత్రి
Headlines:
  1. అట్టహాసంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కొత్తగూడెంలో
  2. జనహృదయనేతగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సేవలను ప్రజలు కీర్తిస్తున్నారు
  3. ప్రజల ఆదరణ పొందిన మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు సుజాతనగర్ లో

జనహృదయనేత,పేద ప్రజల పాలిట ఆశాజ్యోతి, రాజకీయ దురంధరుడు రెవిన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు కొత్తగూడెం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి. సుజాతనగర్ మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సేవలు మరువలేనివని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే మహా నాయకుడని కీర్తించారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ నేనున్నానంటూ ధైర్యం ఇచ్చే ఏకైక నాయకుడు పొంగులేటి అని కొనియాడారు. పదవిలో ఉన్న లేకున్నా నిరంతరం పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరింతగా ప్రజలకు సేవ చేసే భాగ్యం వారికి కల్పించాలని, రాబోవు రోజుల్లో రాజకీయంగా అనేకమైన ఉన్నతమైన పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంత్ రావు, మాజీ ఏఎంసి చైర్మన్ భూక్యా రాంబాబు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ లింగం పిచ్చిరెడ్డి, మాజీ రైతు సమితి చైర్మన్ భాగం మోహన్ రావు, కొప్పుల శ్రీనివాస్ రెడ్ది, సీతయ్య, బానోత్ రామ్నాధం, భూక్యా భద్రు, మరియు జిల్లా,మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment