కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తే.. గత ప్రభుత్వం రూ.7,380 కోట్లకు అమ్ముకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. భారాస హయాంలో హైదరాబాద్‌పై పెట్టిన ఖర్చు వివరాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారా?అని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా వాటర్ లాగింగ్ సెంటర్లు అలాగే ఉన్నాయన్నారు. పాతబస్తీలో మెట్రోరైలు నిర్మాణాన్ని అడ్డుకున్నారని విమర్శించారు. ‘మూసీ’ నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నారన్న ప్రతిపక్షం ఆరోపణలను మంత్రి ఖండించారు.
కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మిస్తే..మంత్రి పొన్నం ప్రభాకర్
by admin admin
Published On: September 28, 2024 1:23 pm
