Site icon PRASHNA AYUDHAM

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు

IMG 20250508 WA2745

*యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు*

*జమ్మికుంట మే 8 ప్రశ్న ఆయుధం*

హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షుడు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని స్థానిక మోత్కులగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశలోనే రాజకీయ ప్రవేశం చేసి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు గా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్లమెంటు సభ్యులను ఏకం చేసి తెలంగాణ గళాన్ని వినిపించి, సోనియా గాంధీ ని మెప్పించి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో ముఖ్య భూమిక పోషించి మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ముందు వరుసలో ఉండి నడిపించారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా 42 శాతం కులగణన అమలుపరచడంలో ప్రముఖ పాత్ర పోషించారని, వారు రానున్న రోజుల్లో మరెన్నో పదవులను అధిరోహించాలనీ యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల పక్షాన కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పర్లపల్లి నాగరాజు, సంధ్య నవీన్, కార్యదర్శి సజ్జు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ కమిటీ కార్యదర్శులు పాతకాల రమేష్, రోమాల రాజ్ కుమార్, మండల కమిటీ కార్యదర్శులు రవి, అజయ్, సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు వినోద్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు తోట స్వప్న, వార్డుల అధ్యక్షులు నరిగే సుమన్, గుల్లి రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజ కొమురయ్య, పొనగంటి కుమార్, పొనగంటి రాజు, గాంధీ, యువజన నాయకులు జావిద్, భాను, శ్రీకాంత్, శివ, అస్రఫ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version