ఏపీ మంత్రి సంధ్యారాణికి తృటిలో తప్పిన పెను ప్రమాదం…

ఆంధ్రప్రదేశ్ గిరిజనుల శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ప్రమాదం తప్పింది. ఆరికతోట సమీపంలో మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురయ్యింది. విజయనగరం జిల్లా రామభద్రపురంలో ఆరికతోట దగ్గర మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం టైరు పేలింది.. దీంతో వాహనం అదుపు తప్పి మరో వ్యాన్‌ను ఢీకొట్టింది. మంత్రి వాహనం ఆ వెనుకే ఉంది.. ఈ ప్రమాదం నుంచి సంధ్యారాణి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఇద్దరు ఎస్కార్ట్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని విజయనగరం పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. సాలూరు నుండి మంత్రి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.వెంటనే మంత్రి సంధ్యారాణి దగ్గరుండి ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు….
Post Views: 16