అంగన్వాడి టీచర్ల, హెల్పర్లతో మంత్రి సీతక్క భేటీ..!

అంగన్వాడి
Headlines :
  1. అంగన్వాడి సిబ్బందికి నాణ్యమైన చీరలు అందించనున్న సీతక్క
  2. అంగన్వాడి సమస్యల పరిష్కారంపై మంత్రి సీతక్క హామీ
  3. రిటైర్మెంట్ బెనిఫిట్స్ త్వరలో – అంగన్వాడి సిబ్బందికి మంత్రి భరోసా

*సచివాలయంలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల తో మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క భేటీ*

*అంగన్వాడి సిబ్బందికి ఇచ్చే చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్న మంత్రి సీతక్క*

గతంతో పోలిస్తే నాణ్యమైన చీరలు ఇవ్వాలని మంత్రికి విజ్ఞప్తి చేసిన అంగన్వాడి టీచర్లు

పలు రకాల డిజైన్ చీరలను చూయించి నచ్చిన చీరను ఎంపిక చేసుకోవాలని అంగన్వాడి టీచర్లను కోరిన సీతక్క

డిజైన్, రంగుల్లో మార్పులు చేయాలని సూచించిన అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు

వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసి త్వరలో చీరలు పంపిణీ చేస్తామని చెప్పిన సీతక్క

*మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క*

అమ్మలాగా చిన్నారుల భవిష్యత్తును తీర్చి దిద్దుతున్న అంగన్వాడి టీచర్లకు ధన్యవాదాలు

మీ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే చీరలు ఇవ్వాలని నిర్ణయించాం

మంచి నాణ్యమైన చీరలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశించారు

ఆర్థిక సమస్యలతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి

అయినప్పటికీ అంగన్వాడి సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాం

రిటర్మెంట్ బెనిఫిట్స్ సాంకేతిక సమస్యలు ఆలస్యం అవుతుంది

ఈరోజు ఆర్దిక మంత్రి బట్టి విక్రమార్కతో చర్చించాం

రిటైర్మెంట్ బెనిఫిట్స్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది

రిటైర్మెంట్ బెనిఫిట్స్ పది రోజుల్లో జీవో వస్తుంది

అంగన్వాడి సమస్యలను ప్రయారిటీ గా పరిష్కరిస్తున్నాం

అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రాలకు భవనాలు నిర్మిస్తాం

అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్యుత్ అందిస్తాం

మహిళలు స్వేచ్ఛగా పనులకు వెళ్లిందుకే క్రష్ లు సహాయపడతాయి

క్రష్ల తో మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి

క్రష్ లతో అంగన్వాడి సిబ్బందికి ఇబ్బందులు లేవుఅంగన్వాడీలకు అనుబంధంగా క్రష్ లను కొనసాగిస్తాంఅంగన్వాడి సిబ్బంది అంతా చిత్తశుద్ధితో పనిచేయండిమంత్రి హామీతో క్రష్ లను స్వాగతిస్తున్నామని చెప్పిన అంగన్వాడీ టీచర్లు*

Join WhatsApp

Join Now