మూసాపేట జనతా నగర్ లో కృష్ణాష్టమి వేడుకలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు..
ప్రబోధిత శ్రీకృష్ణ గీత భారతదేశానికే కాకుండా ప్రపంచ మానవాళికి అంతటికి ఆచరణీయమని ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి మూసాపేట జనతా నగర్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు వి హెచ్ పి 60 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో విహెచ్పి ప్రతినిధులు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం , గొట్టుముక్కల వెంకటేశ్వరరావు తూము వేణు తదితరులు పాల్గొన్నారు.