ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పనితీరుకు నిదర్శనం
గతేడాది వర్షాకాలంలో కొట్టుకుపోయిన బ్రిడ్జీ.. ఇంతవరకు ప్రత్యామ్నాయ మార్గం కూడా నిర్మించని సీతక్క
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో గత సంవత్సరం కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయిన బ్రిడ్జీ
కొండాయి నుండి చెన్నబోయినపల్లి మీదుగా ఏటూరునాగారం వెళ్లడానికి ఉన్నది ఇదొకటే మార్గమని, బ్రిడ్జీ కూలిపోయి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కొండాయి గ్రామస్తులు
వాగులో నీళ్లు లేని సమయంలో వాగులో నుండి వెళ్తున్నామని, నీళ్లు ఉంటే దట్టమైన అడవిలో నుండి కాలినడకన ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్న గ్రామస్తులు
వానకాలం వచ్చే కొన్ని రోజులముందే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారని, వర్షాలు పడుతుంటే పనులు ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మంత్రి సీతక్క తమను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కొండాయి గ్రామ ప్రజలు
ఈ బ్రిడ్జి సీతక్క టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మాణం జరగడం గమనార్హం