*ములుగు జిల్లా అని రాష్ట్రంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతానన్న సమ్మక్క సారలమ్మల వారసురాలు మంత్రి సీతక్క.*
*కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క ములుగు జిల్లా పర్యట్లో భాగంగా లక్కవరంలో పర్యటించారు. సహచర మంత్రులు, ప్రజా ప్రతినిధులను లక్కవరం అందాలను తిలకించేందుకు ఘనంగా స్వాగతించారు. తదనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సహకారంతో ములుగు జిల్లా ను రాష్ట్రంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దానన్నారు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ములుగు జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సీతక్క మరియు మంత్రి జూపల్లి కృష్ణరావు తెలియజేశారు. ములుగు జిల్లా, లక్నవరం జలాశయంలో రూ. 7 కోట్ల వ్యయంతో 3 ఎకరాల విస్తీర్ణంలో టీజీటీడీసీ, ఫ్రీకోట్స్ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన మూడో ద్వీపాన్ని (ఐలాండ్ ను) మంత్రి సీతక్క మరియు సహచర మంత్రులు ప్రజాప్రతినితో కలిసి ప్రారంభించారు… జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శీతాక అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.*