మంత్రిగారు…. ఒక్కసారి ఈ జాతీయ రహదారి పనులు చూడండి…?
* జాతీయ రహదారి పనులు ఇదేవిధంగా ఉంటాయా?
ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 6:
రహదారి పనులు నాణ్యతగా ఉన్నాయా? లేక నాణ్యతకు తోట్లు పొడుస్తున్నారా? మంత్రిగారు మీరే తేల్చి చెప్పాల్సి ఉంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు మాత్రం జాతీయ రహదారి నాణ్యత పై మాట్లాడటం లేదు. ఆ కాంట్రాక్టర్కు ,ఈ ఎమ్మెల్యేలకు మధ్య ఏం సంబంధం ఉందో గాని, కోట్ల రూపాయలు వెచ్చించి, భవిష్యత్ తరాలకు జాతీయ రహదారి నిర్మాణం పనులు చేపట్టడానికి, కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున నిధులు మంజూరు అవుతుంటే పనులు మాత్రం నాసిరకంగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఉన్న పాత రోడ్డును పూర్తిగా తొలగించి ,అడుగున్నర లోతు త్రవ్వకాలు జరిపి దొడ్డు కంకర, సన్నం కంకర, మొరం, సిమెంట్ కంకర్తో వేసి రోలర్ తో తొక్కించవలసి ఉండగా, ఈ నిబంధనలను గాలికి వదిలేశారు. ముఖ్యంగా జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో ఎంత నీటిని తడుపుతే అంత రహదారి పటిష్టంగా ఉంటుంది. కానీ మంత్రిగారు… ఆ కాంట్రాక్టర్కు ఎవరి అండదండలు ఉన్నాయో లేవో కానీ 20 ఏళ్ల పాటు పటిష్టంగా ఉండవలసిన ఈ జాతీయ రహదారి పనులకు తూట్లు పొడుస్తున్నారు. నిజాంసాగర్ బొగ్గు గుడిసె వద్ద బైపాస్ రోడ్డు నిర్మాణానికి మొరం ,కంకర వేసి రోడ్డును ఎత్తు పెంచాల్సి ఉండగా దానిని పక్కనపెట్టి, కాంట్రాక్టర్ వేరే చోట రోడ్డు మీది తారు మట్టిని తీసుకువచ్చి ఎత్తు పెంచడానికి వినియోగిస్తున్నారు. జాతీయ రహదారి పనులు అంటే ,ఏ విధంగా పటిష్టంగా ఉండాలో నిబంధనలు వెల్లడిస్తున్నాయి. కానీ కాంట్రాక్టర్ మొత్తం దానిని తుంగలో తొక్కి ఇష్ట రాజ్యాంగ పనులు సాగుతుంటే, ఆ ప్రాంత ప్రజలు పనులపై పెదవి విధిస్తున్నారు గానీ, మూడు నియోజకవర్గాలకు రాజ్యమేలుతున్న ఎమ్మెల్యేలు మాత్రం ఈ జాతీయ రహదారి పనుల తీరుపై పర్యవేక్షణ చేయకపోవడం కారణం ఏందో తెలియడం లేదు. మంత్రిగారు… మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం లో పర్యటన కు రానున్న దృష్ట్యా, ఈ రహదారి పనులు ఒక్కసారి మీ వాహనాన్ని ఆపి చూడండి. పనులు నాణ్యతంగా ఉన్నాయా? లేదా మీరే ఓ మంత్రి స్థాయిలో తేల్చండి. అంటూ మూడు నియోజకవర్గాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డును ఎత్తు పెంచవలసి ఉండగా, ఉన్న రోడ్డుపై రెండు అంగుళాలతో తారు తొలగించి ,ఆ స్థానంలో కంకర వేసి మళ్లీ తారుపోసి ఎత్తు పెంచకుండా, అదే స్థాయిలో నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ విషయంలో సంబంధిత శాఖ అధికారులకు వివరణ అడిగితే పనులు అట్లనే ఉంటాయి ,అంటూ సమాధానం చెప్పి చేతులు ఎత్తివేస్తున్నారు.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణం నుంచి రుద్రూర్ వరకు 96 కిలోమీటర్లు, 898 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపడుతున్నారు. భారీ ఎత్తున చేపడుతున్న ఈ జాతీయ రహదారి నిర్మాణంలో అడుగడుగుల నాణ్యత లోపిస్తుంది. ఒక వైపు రహదారి నిర్మాణం సక్రమంగా జరగడం లేదు, మరొకవైపు మురికి కాలువ నిర్మాణం నాణ్యతంగా చేపట్టడం లేదు. వీటికి సరియైన నీటితో తడపకపోవడం వల్ల ఎక్కడికక్కడ పగుళ్ల బారిన పడుతున్నాయి. అయినా సంబంధిత శాఖ అధికారులు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండడం పట్ల ,అధికారుల పనితీరుపై విమర్శలు తల ఎత్తుతున్నాయి. రోడ్డు పక్కన వేసిన కంకర రోడ్డుపై నీటితో తడపక పోవడంతో ధూళి ,దుమ్ముతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ పనులను నాణ్యతంగా చేపిద్దామన్న ఆలోచన సంబంధిత శాఖ అధికారులకు కలగకపోవడం, దీనికి తోడు మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీ సురేష్ షెట్కర్ ఈ పనులపై పర్యవేక్షణ చేపట్టకపోవడం వల్ల జాతీయ రహదారి పనులు ఇష్ట రాజ్యాంగ కొనసాగుతున్నాయి. రెండు దశాబ్దాల పాటు పటిష్టంగా ఉండాల్సిన ఈ రహదారి పనుల ప్రారంభంలోనే నాణ్యతకు తూట్లు పొడుస్తున్నారు. మంత్రి గారు ఈ జాతీయ రహదారి పనులను పర్యవేక్షించండి.అంటున్న అమాయక ప్రజలు