Site icon PRASHNA AYUDHAM

పంట నష్టం చేసిన దుండగులు

*పత్తి పంటపై గడ్డి మందు పిచికారి చేసిన దుండగులు -మాడి మసైన పంట సెను*

*లబోదిబో మంటూ కన్నీటి పర్యంతం చెందిన బాధిత రైతు తన భార్య*

*గడ్డి మందు పిచికారి చేసిన వ్యక్తులపై కేసు నమోదు ఎస్సై రాజకుమార్*

*జమ్మికుంట/ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 5*

మండల పరిధిలోని మల్యాల రెవిన్యూ పరిధిలో గల సర్వేనెంబర్ 192/D/1/B లో వాగులు రామన్నపల్లె గ్రామానికి చెందిన చింతం చంద్రమోహన్ అనే రైతు పత్తి పంట సాగు చేస్తూ పత్తి ఏపుగా పెరగడం జరిగిందని సోమవారం ఉదయం 8 గంటల సమయంలో రైతు పంట పొలంలోకి వెళ్లి చూచేసరికి పత్తి సెను మాడి మసైపోయినట్టు కనిపించడం జరిగిందని భార్యాభర్తలిద్దరూ లబోదిబోమంటూ కన్నీటి పర్యంతం చెందారు వెంటనే గ్రామంలోని పెద్దలను పంట సెను వద్దకు తీసుకెళ్లి చూపించి పోలీస్ స్టేషన్లోకి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగిందని బాధ్యత రైతు తెలిపారు వాగొడ్డు రామన్నపల్లి గ్రామానికి చెందిన తెప్పే కొమురయ్య తిప్పే విజయపాల్ అనే వ్యక్తులు పంటను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు పత్తి పంట ధ్వంసం చేసిన ఆ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తెప్ప కొమురయ్య తనకు ఉన్న 192/d/1/b సర్వే నెంబర్ లో గల 31గుంట భూమి ని అదే గ్రామానికి చెందిన చింతం చంద్రమోహన్ కు గత సంవత్సరం విక్రయించాడని కొమురయ్య కు బాధిత రైతు రూ. 6 లక్షలు ఇవ్వడం జరిగిందని అప్పటినుండి చంద్రమోహన్ కబ్జాకు ఉంటూ రెండు పంటలు తీయడం జరిగిందని మిగతా డబ్బులు తీసుకొని భూమి పట్టా చేయమంటే చేయడం లేదని
ఈ ఖరీఫ్ సీజన్లో చంద్రమోహన్ పత్తి పంటను సాగు చేయడం జరిగిందని తెలిపారు అనుకున్నట్లుగానే పంట ఏపుగా పెరిగిందని ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటలకు తెప్ప కొమురయ్య అతని కుమారుడు విజయ్ పాల్ ఇద్దరు వ్యక్తులు పంట పై గడ్డి మందు పిచికారి చేశారని దీంతో మొక్కలన్ని పూర్తిగా మాడిపోయాయని బాధిత రైతు తెలిపాడు. ఏపుగా పెరిగిన పంటను చూసి దిగుబడి పై కొండంత ఆశ పెట్టుకోగా తన పంటను ధ్వంసం చేశారని బాధిత కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ రోదించారు
డబ్బులు తీసుకుని పట్టా చేస్తానని మోసం చేసిన ఇతనిపై గతంలో కూడా చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజకుమార్ తెలిపారు.

Exit mobile version