*అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదు*
*జమ్మికుంట జనవరి 24 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు పట్టణ సిఐ వరగంటి రవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట గ్రామానికి చెందిన బొల్ల అనూష ( 19) గత 18 నెలల నుండి హనుమకొండలోని ఐడి ఈసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది. సంక్రాంతి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చింది . ఈనెల 22 అర్ధరాత్రి సుమారు రెండు గంటలకి తన తండ్రి అయిన బొల్లా కొమురయ్య లేచి చూడగా, అనూష కనిపించలేదు. చుట్టుపక్కల వెతికిన కనిపించకపోవడంతో తన బంధువులకు ఫోన్ చేసి అడగగా, వారు మాకు తెలియదని చెప్పడంతో జమ్మికుంట పోలీస్ స్టేషన్ వచ్చి బోల్ల కొమురయ్య దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వరంగoటి రవి తెలిపారు.