సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పరిధిలోని మునిపల్లి, కోహిర్, ఝరాసంఘం, జహీరాబాద్, మొగుడంపల్లి, కంది, సదాశివపేట, కొండాపూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీ, పటాన్‌చెరు మండలాల ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే రక్షిత మంచి నీటిని మరమ్మత్తుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మిషన్ భగీరథ ఈఈ విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మీ మాట్లాడుతూ.. సింగూరు ఆనకట్ట వద్ద ఉన్న బూసరెడ్డిపల్లి 100 ఎంఎల్డీ నీటి శుద్ధి కర్మాగారంలో అత్యవసర మరమ్మత్తు పనులు జరుగుతున్నందున, శనివారం (11 అక్టోబర్) మధ్యాహ్నం 12 గంటల నుండి ఆదివారం (12 అక్టోబర్) సాయంత్రం 8 గంటల వరకు రెండు రోజుల పాటు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా నిలిపి వేయనున్నట్లు తెలిపారు. అందువల్లన సంబంధిత మండలాల ప్రజలందరూ వారి అవసరాలకు సరిపడా నీటిని ముందుగానే నిల్వ చేసుకోవాలన్నారు. ఆయా మండలాల ప్రజలు మిషన్ భగీరథ సిబ్బందికి సహకరించవలసిందిగా మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
మిషన్ భగీరథ నీటి సరఫరా తాత్కాలికంగా నిలిపివేత: మిషన్ భగీరథ ఈఈ విజయలక్ష్మి
Oplus_131072