ఉత్సాహంగా కమ్మ సంఘం వనభోజనాలు

ఉత్సాహంగా
Headlines
  1. మియాపూర్ కమ్మ సంఘం వనభోజనాలు: సందడిగా సాంస్కృతిక కార్యక్రమాలు
  2. ఎన్టీఆర్ విగ్రహానికి ఘట్టమనేని బాబురావు నివాళి
  3. కార్తీక మాసం పూజలు: ఉసిరి చెట్టు వద్ద మహిళల ప్రత్యేక కార్యక్రమం
  4. మియాపూర్ వనభోజనాల్లో ప్రత్తిపాటి పుల్లారావు, గరికపాటి మోహన్ రావు సందేశాలు
  5. కమ్మ సంఘం వనభోజనాల్లో ప్రముఖుల సందడి
ప్రశ్న ఆయుధం నవంబర్ 24: శేరిలింగంపల్లి ప్రతినిధి  

మియాపూర్ లో ఆదివారం మియాపూర్ కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. మహిళలు ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు దంపతులు పూలతో నివాళులు అర్పించారు . సాంస్కృతిక కార్యక్రమాలు సందడిగా సాగినాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమంలో కొనసాగాలని. పదిమందికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ విద్యా ఉపాధి రంగాల్లో అందరూ రాణించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు వీరపనేని పద్మ, రామచంద్ర, ప్రముఖ దర్శకులు పర్వతనేని రాంబాబు, పారిశ్రామికవేత్త మండవ రమేష్, కూకట్పల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే బండి రమేష్. వెంగళరావు నగర్ మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ హెచ్ఎండిఏ అసిస్టెంట్ డైరెక్టర్ చక్రపాణి, హెచ్ఆర్ నిపుణులు గురుమూర్తి భారీగా హాజరైన కమ్మ సోదర సోదరీమణులు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కమ్మ సంఘం అధ్యక్షులు డి ఎస్ ఆర్ కె ప్రసాద్, మియాపూర్ కమ్మ సంఘం అధ్యక్షులు లీలా ప్రసాద్, ఉపాధ్యక్షురాలు విష్ణు ప్రియ, కోశాధికారి హెచ్ చౌదరి, కార్యదర్శులు రవి, సాంబయ్య, శ్రీరామచంద్రమూర్తి, సత్యనారాయణ సత్యనారాయణ చిట్టినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment