దండోరా విజయోత్సవ ర్యాలీకి బయలుదేరిన మాదిగ జర్నలిస్టులు
సిద్దిపేట జిల్లా నుండి దండోరా విజయోత్సవ ర్యాలీ కి బయలుదేరిన మాదిగ జర్నలిస్టులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర కార్యదర్శి మరాటి కృష్ణమూర్తి మాట్లాడుతూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుండి తెలంగాణ గడ్డ హైదరాబాదుకు చేరుకున్న సందర్భంగా స్వాగతం పలకడానికి సిద్దిపేట జిల్లా నుండి జర్నలిస్టులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు మొండి బిక్షపతి, జిల్లా నాయకులు చేబర్తి సత్యం, ఎమ్మార్పీఎస్ నాయకులు నత్తి రామకృష్ణ, బలిపురం యాదగిరి తదితరులు తరలి వెళ్లారు.