మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియూ కార్పొరేటర్లు

మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియూ కార్పొరేటర్లు

ప్రశ్న ఆయుధం మే20: శేరిలింగంపల్లి ప్రతినిధి

IMG 20250520 WA2668 scaled

మైనారిటీస్ మహిళా శక్తి పథకం రేవంతన్న భరోసాలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పీఎసీ ఛైర్మెన్ అరేఖపూడి తో కలిసి మైనారిటీ మహిళలకు కుట్టు మెషిన్లను పంపిణి చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. ఇంట్లోనే మైనారిటీ మహిళలకు ఉపాధి కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, పద్మారావు, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now