*హెచ్ ఎఫ్ సి వి ఫాండషన్ తృతీయ వార్షికోత్సవంలో.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ*
ఎల్లవేళలా సైబర్ క్రైమ్ బాధితులకు అండగా ఉంటాం..
హెచ్ ఎఫ్ సి వి ఫాండషన్ స్థాపకుడు పులి అరవింద్ కుమార్
ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 19: కూకట్‌పల్లి ప్రతినిధి
హెచ్ ఎఫ్ సి వి ఫాండషన్ సైబర్ క్రైమ్ బాధితులకు అండగా నిలవడం అభినందనీయమని శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. బుధవారం నియోజకర్గం పరిధిలోని కేపీ హెచ్ బి బస్టాప్ సమీపంలోని పి ఎన్ ఆర్ ఎంపైర్ లో జరిగిన హెల్ప్ ఫర్ సైబర్ విక్టిమ్స్ ఫౌండేషన్ తృతీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్ ఎఫ్ సి వి ఫాండషన్ ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వివిధ రకాలుగా సైబర్ క్రైమ్ నేరాలకి గురయిన బాధితుల సమస్యలను పరిష్కరించడం, ఎందరో జీవితాలకు భరోసాని, ధైర్యాన్ని ఇవ్వడం హెచ్ ఎఫ్ సి వి ఫాండషన్ కి, స్థాపకుడు పులి అరవింద్ కుమార్ కె చెందిందిన్నారు. బాలానగర్ జోన్ ఏసిపి హన్మంత్ రావు మాట్లాడుతూ మూడు సంవత్సరాలుగా సైబర్ క్రైమ్ బాధితులకు సేవలందించడం అభినందనీయమని కొనియాడారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెచ్ ఎఫ్ సి వి ఫాండషన్ స్థాపకుడు పులి అరవింద్ కుమార్ మాట్లాడుతూ 2022 ఫిబ్రవరి 19న ప్రారంభమయిన తమ సంస్థ మూడవ వార్షికోవత్సవం చేసుకోవడం ఆనందంగా ఉందని, సంస్థ ఎల్లవేళలా సైబర్ క్రైమ్ బాధితులకు అండగా నిలుస్తుందని, తమ సేవలు మునుముందు ఇలాగే కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగద్గిరి గుట్ట సీఐ నర్సింహా, జీడిమెట్ల సీఐ మల్లేష్, ఎస్ ఐ లు శంకర్, రవి కిరణ్, అబ్దుల్, అడ్వకేట్ శ్వేత, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.