ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు ఘన సన్మానం

*దటీజ్ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు ఘన సన్మానం

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 6 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు

* పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఎస్.వీ కెన్ ఆర్గనైజేషన్ ఘనంగా సన్మానించింది. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు అయిన సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్రను ఆర్గనైజేషన్ నిర్వాహకులు ఆహ్వానించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ వి కెన్ ఆర్గనైజేషన్ పదేళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆర్గనైజేషన్ ద్వారా పేద విద్యార్థులకు బట్టలు, బుక్స్ ఇవ్వడం ఇలాంటి మంచి సేవ కార్యక్రమములు చేపట్టడం ఆనందకరంగా ఉందని ఇలాంటి మంచి సేవకార్యక్రమాలు చేపట్టి మరింత గుర్తింపు తెచ్చుకోవాలని భవిష్యత్తులో మరిన్ని సేవ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now