ప్రతిభతోనే ఉన్నత అవకాశాలు  ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

*ప్రతిభతోనే ఉన్నత అవకాశాలు*

*ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 1( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు

క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరచి ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని స్థానిక శాసనసభ్యులు బోనెల విజయ చంద్ర పేర్కొన్నారు. స్థానిక ఆర్.సి.ఎం కార్యాలయ సముదాయం ఆవరణలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయి వేసవి శిక్షణా తరగతులను గురువారం లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. చదువులో మొదటి స్థానం నిలిచిన విధంగానే క్రీడల్లో కూడా జిల్లా ఖ్యాతిని ఇనుమడించాలని ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యం పెంపొందించుకొనేందుకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, క్రమశిక్షణ, ఏకాగ్రతకు తోడ్పాటునిస్తాయన్నారు. పిల్లలు ఎంచుకున్న రంగంలో రాణించేవిధంగా తల్లిదండ్రులు ప్రోత్సంచాలని కోరారు. క్రీడాకారులు ఆసక్తి కలిగిన క్రీడా విభాగంలో కఠోర సాధనతో శ్రమించి లక్ష్యాన్ని సాధించాలన్నారు. శిక్షకుల ద్వారా మెళుకువలు తర్ఫీదు పొంది అత్యుత్తమ ప్రతిభను చూపాలని సూచించారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ విభాగాల్లో క్రీడాకారులు ప్రదర్శించిన క్రీడలను తిలకించారు. వేసవి క్రీడా శిక్షణా శిబిరానికి క్రీడా సామాగ్రిని ఎమ్మెల్యే శిక్షకులకు అందజేశారు.

ఈ కార్యక్రమలో జిల్లా విద్యా శాఖ అధికారి రమాదేవి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎం.మురళీ కృష్ణ, అంతర్జాతీయ బాక్సర్, అర్జున్ అవార్డు గ్రహీత సీరా జయరాం,ఆర్చరీ జిల్లా కార్యదర్శి డి.టీ.గాంధీ, పి.ఈ.టీలు, పీడిలు, క్రీడాకారులు, తదితరులు, పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now