*సదాశివపేట అయ్యప్ప దేవాలయంలో రక్తదాన శిబిరం*
*మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ*
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రాణాపాయ స్థితిలో ఉన్న తోటి వారిని కాపాడడంలో రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సదాశివపేట పట్టణ కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో కీ.శే ఓదెల ప్రభుగుప్తా గురుస్వామి జ్ఞాపకార్థం తనయుడు ఓదెల విలాస్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని, పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై స్వామి వారిని దర్శించుకొని, కార్యక్రమాలను ప్రారంభించారు. సదాశివపేట పట్టణం, మండల పరిసర ప్రాంతాలకు చెందిన 100మంది శిబిరంలో రక్తదానం చేశారు. 100 యూనిట్ల రక్తాన్ని ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్త, నేత్ర, అవయవ ధానాలపై ప్రజలు అపోహలు వీడాలని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో రక్తం అందించినట్లయితే వారికి ప్రాణాలు పోసిన వారమవుతామని ఆయన తెలిపారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు తన చేతులు మీదుగా ఉచిత బట్టల పంపిణీ చేశారు. ఎమ్మెల్యేను చింతా ప్రభాకర్, ఓదెల ప్రభుగుప్త, సతీమణి ఓదెల నాగలక్ష్మిలను ఆలయ కమిటీ తరుపున సన్మానించారు. ఈ సందర్భంగా ఓదెల విలాస్ గుప్తా మాట్లాడుతూ.. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. శిబిరాన్ని విజయవంతం చేయడానికి తోడ్పాటు అందించిన శ్రీ అయ్యప్ప సేవ సమితి, సంగారెడ్డి సాయితి హాస్పిటల్, సహకరించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసై టీ, జిల్లా బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అపర్ణ శివరాజ్ పటేల్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, శ్రీ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు గోనే శంకర్ గురుస్వామి, ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ గురుస్వామి, వోదేల రవీందర్ గుప్తా గురు స్వామి, కోశాధికారి అమ్రాది రాచన్న గురుస్వామి, సభ్యులు మామిడి రాజు గురుస్వామి, స్థానిక కౌన్సిలర్ లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు.