లేడీస్ ఎంపోరియం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన
ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 29, జగిత్యాల లేడీస్ ఎంపోరియం యూనియన్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపినారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా జగిత్యాల అభివృద్ధి కి కృషి చేస్తానని జగిత్యాల విద్య వైద్యానికి హబ్ గా మారనుందని నియోజకవర్గానికి కస్తూర్బా, ఏకలవ్య పాఠశాల, కేంద్రీయ విద్యాలయం, నవోదయ స్కూల్ మంజూరు కానున్నాయి అన్నారు. జగిత్యాల పట్టణం అభివృద్ది మౌలిక సదుపాయాలు కల్పనతోనే వ్యాపారాలు వృద్ధి సాదిస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,
పాంపర్తి రవీందర్,
వర్తక సంఘం అధ్యక్షులు కమటాల శ్రీనివాస్, అధ్యక్షులు దీటి అంజయ్య, ప్రధాన కార్యదర్శి ఊటూరి శ్రీధర్, కోశాదికారి వేణుమాధవ్, గౌరవ అధ్యక్షులు మల్లికార్జున్, నాగభూషణం, శ్రీనివాస్, కౌన్సిలర్ లు చుక్క నవీన్, కప్పల శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.