నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఆర్సీ ప్రశ్నఆయుధం ఆగస్టు 11
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం రాజుల్లా గ్రామంలో, మద్నూర్ మండల కేంద్రంలో మరియు పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలో లబ్దిదారులకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది.అదేవిధంగా రేషన్ కార్డులతో పాటు లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ మరియు CMRF చెక్కులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి,రెవెన్యూ అధికారులు,ప్రజాప్రతినిధులు నాయకులు,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.