Site icon PRASHNA AYUDHAM

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 28 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని గోమారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విచ్చేసి ఎఫ్. పి.ఓ. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టపడి పండించి పంటను వడ్లు నానినా గాని కొనుగోలు చేయాలని సన్న రకముతో పాటు రైతు పండించిన ప్రతి వడ్ల రకానికి 500 బోనస్ చెల్లించాలని రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందికి గురి చేయకూడదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాజా రమణా గౌడ్ . మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ. మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్ర గౌడ్. మాజీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్. మాజీ సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి. రైతులు పాల్గొన్నారు.

Exit mobile version