Headlines :
-
పామాయిల్ గెలల ధర పెరగడానికి కృషిచేసిన అధికారులకు MLA జారే సన్మానం
-
19,000 వేలు ధర పెరగడానికి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు
-
అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 19.40% ఓఈఆర్ రికవరీ
-
రైతులు నాణ్యమైన గెలలు ఫ్యాక్టరీకి తరలించాలని MLA జారే సూచనలు
-
రాష్ట్ర ఆయిల్ ఫెడ్ అధికారులు, రైతుల పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతం
ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్ సి నవంబర్ 2
అప్పారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ మాట్లాడుతూ, పామాయిల్ గెలల ధర 19,000 వేలు
ధర పెరుగుదలకు విశేషంగా కృషిచేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి అలాగే ఆయిల్ ఫెడ్ రైతు సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మలేషియా టెక్నాలజీతో నిర్మించినటువంటి అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 19.40% ఓ ఈ ఆర్ ఆయిల్ రికవరీ శాతం వచ్చినందున ఆయిల్ రికవరీలో మలేషియా తో పోటీపడి ఆ దేశంలో 19.50% రికవరీకి దరిదాపుగా చేరినందున రైతులకు పామాయిల్ గెలల ధర గరిష్టంగా పెరగటానికి కారణమైంది ఓ ఈ ఆర్ పెరుగుదలకు విశేషంగా కృషిచేసి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం 19.40% ఓఈఆర్ సాధించినందుకు నియోజకవర్గ రైతుల పక్షాన యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయిల్ ఫెడ్ సూచనలు పాటించి పూర్తిగా పక్వానికి వచ్చిన నాణ్యమైన గెలలు ఫ్యాక్టరీకి తరలించి ఆయిల్ రికవరీ శాతం మరింత పెంచే విధంగా రైతులు కృషి చేయాలన్నారు తద్వారా రానున్న రోజుల్లో పామ్ ఆయిల్ గెలల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ అధికారులు, ఆయిల్ ఫెడ్ రైతు సంఘం నాయకులు, ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం, పామాయిల్ రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.