జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారె

జాతీయ
Headlines in Telugu:
  1. జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారె
  2. గ్రామస్తులను చైతన్య పరుస్తూ రైతులకు సేంద్రీయ వ్యవసాయం
  3. మల్లారం గ్రామంలో ప్రత్యేక శిబిరం – విద్యార్థుల పాత్ర
  4. వైద్య శిబిరం నిర్వహణ, పశు సంపదపై సూచనలు
  5. అశ్వరావుపేటలో గ్రామస్తులకు సద్వినియోగం కోసం చక్కటి అవకాశం

ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి నవంబర్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అశ్వరావుపేట కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో
దమ్మపేట మండలం మల్కారం రైతువేదికలో ఈరోజు నుంచి ఈనెల 8వ తారీకు వరకు జరగనున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని స్థానిక శాసనసభ్యులు
జారె ఆదినారాయణ ప్రారంభించారు.
అనంతరం శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల విద్యార్థులు వారం రోజులపాటు మల్లారం గ్రామంలోనే ఉంటూ గ్రామస్తులను చైతన్య పరుస్తూ గ్రామాలలో ఉండే సమస్యలను అధిగమించటానికి అవలంబించాల్సిన అధునాతన పద్ధతులపై ప్రయోగాలు నిర్వహిస్తారని. అలాగే గ్రామస్తులతో మమేకమై గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తారని రైతులకు ఉపయోగపడేలా భూసార పరీక్షలు చేసి పరీక్షల ఆధారంగా సేంద్రీయ వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించే విధంగా రైతులను ప్రోత్సహిస్తారని అలాగే గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల కోసం వైద్య శిబిరం నిర్వహిస్తారని, పశు సంపదపై కూడా రైతులకు తగు సూచనలు ఇస్తారని. ఈ చక్కటి అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అనంతరం కళాశాల విద్యార్థులు వ్యవసాయ అనుబంధంగా రూపొందించిన ప్రత్యేక స్టాళ్లను పరిశీలించి విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మల్లారం గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now