ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్ సి
దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో పాలడుగుల ప్రశాంతి అనారోగ్య కారణంగా మరణించగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. అనంతరం స్థానిక నాయకుల ద్వారా గ్రామంలో డ్రైనేజీ సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వర్షపు నీరు నిల్వ లేకుండా చూడాలని ఆదేశించారు. దమ్మపేట మండల కేంద్రంలో షాదీ ఖానా వద్ద వరద నీరు ఆగకుండా జరుగుతున్న పనులను పరిశీలించారు.స్థానిక విజయ గణపతి లారీ ఆఫీస్ ను సందర్శించి నిర్వాహకుల ద్వారా వారి సమస్యలు తెలుసుకున్నారు.
దమ్మపేట,మందలపల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే జారే
by Naddi Sai
Published On: July 27, 2025 7:36 pm