తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే జారే

 

 అన్నపురెడ్డిపల్లి మండలకేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ బాలికల కళాశాలను సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు

 *జారె ఆదినారాయణ* గారు సందర్శించి ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించి విద్యార్థులతో మాట్లాడుతూ దీక్ష పట్టుదలతో చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేశారు అలాగే కళాశాలకు కావలసిన ఫర్నిచర్ త్వరలో ఏర్పాటు చేసి డిజిటల్ క్లాసులు నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తూ ముఖ్యంగా విధులు నిర్వహించే సమయంలో మొబైల్ ఫోన్ వాడటం వలన ఆ ప్రభావం పిల్లల మీద పడుతుందని దానివల్ల బోధించే సమయం తగ్గిపోవడం వలన విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని తన దృష్టికి వచ్చినందున తమ అభ్యర్థనగా విధినిర్వాహణలో మొబైల్ ఫోన్ కి దూరంగా ఉండాలని సూచించారు

 ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ సూచనని పాటించి మొబైల్ ఫోన్ కు దూరంగా ఉంటామని ఎమ్మెల్యే కి హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now