కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ‌. ‌            

*కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి* ‌. ‌

*హుజురాబాద్ జనవరి11 ప్రశ్న ఆయుధం*

హుజురాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పట్టణ మండల పరిధిలోని 169 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన చేతుల మీదుగా అందజేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ 169 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తులం బంగారం కూడా ఇవ్వాలని కోరారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకోవాలని లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానం మోసపూరితమని అన్నారు తులం బంగారం లబ్ధిదారులకు ఇచ్చి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని అదేవిధంగా ఎస్సారెస్పీ కాలువ ద్వారా రబ్బి పంటకు క్రమం తప్పకుండా నీటిని అందించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడుతామని పోరాడే కార్యక్రమంలో ఎన్ని కేసులు అయినా లెక్కచేయనని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని మాయ మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని తాను ఎంతటి పోరాడానికైనా సిద్ధమని తెలిపారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్. సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ హుజురాబాద్ మాజీ జెడ్పిటిసి పడదం బక్కారెడ్డి. హుజురాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్. హుజురాబాద్ మాజీ ఎంపీపీ ఇరుముల్ల రాణి సురేందర్ రెడ్డి. వైస్ ఎంపీపీ బండి రమేష్ పట్టణ కౌన్సిలర్లు రమాదేవి సుశీల అపరాధి తిరుమల్ అపరాజ ముత్యం రాజు రమేష్ కిషన్ రెడ్డి కుమార్ పూర్ణచందర్ లతోపాటు మండల నాయకులు మాజీ సర్పంచులు ప్రతాపరెడ్డి కిరణ్ కొండల్రెడ్డి వెంకటేష్ సతీష్ శ్రీనివాసులతో పాటు లబ్ధిదారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment