ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి*

*జమ్మికుంట నవంబర్ 5 ప్రశ్న ఆయుధం::-*

హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం ఇల్లందకుంట జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందజేశారు. పేద, నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించడంలో ఆయన ధృఢమైన సంకల్పంతో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి నిర్వహిస్తున్నారు ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజల ఇళ్ల వద్దకే చేరుకుని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కులను సహాయం అందించారు గ్రామాల్లో చెక్కుల పంపిణీ చేసి ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థిక సహాయం అందిస్తూ హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి సాగిస్తానని అన్నారు ఈ విషయాన్ని ప్రెస్ మీట్ లో ప్రజలకు తెలియజేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన కట్టుబాటును పాడి కౌశిక్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ వారి సంక్షేమానికి తన ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ ప్రజలకు తోడుగా నిలుస్తున్నానని పేర్కొన్నారు తాను మొదటగా ఇల్లందకుంట మండలంలో ఇల్లందకుంట శ్రీరాములపల్లి కనగర్తి లక్ష్మాజిపల్లి సిరిసేడు పాతర్లపల్లి మర్రివానిపల్లి టేకుర్తి బూజునూర్ గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి అనంతరం జమ్మికుంట మండలంలోని వావిలాల నగురం పాపక్కపల్లి తనుగుల గండ్రపల్లి నాగంపేట శాయంపేట బిజ్జిగిరి షరీఫ్ పాపయ్యపల్లి వెంకటేశ్వరపల్లి విలాసాగర్ కాపులపల్లి మడిపల్లి అంకుశాపూర్ మాచనపల్లి పెద్దంపల్లి జగ్గయ్యపల్లి గ్రామాల్లో చెక్కులను పంపిణీ చేసి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమురెల్లి ఇల్లందకుంట మండల మాజీ ఎంపీపీ పావని వెంకటేష్ జమ్మికుంట మండల మాజీ ఎంపీపీ మమత దుర్గాప్రసాద్, ఇల్లందకుంట మండల మాజీ సర్పంచులు నాయకులు జమ్మికుంట మండల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now