ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ అమలు కొరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోరం కనకయ్య లెటర్*

ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 20 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ వెల్లడించారు. ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యను కోయగూడెం ఆయన నివాస గృహంలో కలవడం జరిగింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నవి ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల రాజ్యాంగ రిజర్వేషన్ ఉద్యోగ,ఉపాధి,రాజకీయ పరమైన అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోరం కనకయ్య లెటర్ ఇచ్చినారు.ఎస్సీ కులాలు ఎదుర్కొంటున్న సమస్యలును పరిష్కరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏజెన్సీ ప్రాంతా ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ జనరల్ లో కలిపి అంధకారంలో నెట్టి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే కోరంకు బొమ్మెర శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి నాయకులు కండే రాములు, ఎనగంటి అర్జున్ రావు,ఆర్ నరసయ్య,మీసాల రాములు,సరికొండ స్వామి,సలిగంటి కొమరయ్య, వెంకటేశ్వర్లు,ఎనగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now