సంతోష్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

సంగారెడ్డి/గుమ్మడిదల, సెప్టెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుకు రక్షణగా నిలబడి జరిగిన దాడిలో అడ్డు పడి గాయపడిన సంతోష్ రెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంతోష్ రెడ్డిని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తదితరులు పరామర్శించి, త్వరగా కోలుకోవాలని తెలిపారు. వీరి వెంట నాయకులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now