Site icon PRASHNA AYUDHAM

వైద్యసేవల విస్తరణలో ముందున్న ఎమ్మెల్యే మదన్ మోహన్– వెల్లుట్ల, అన్నసాగర్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభం

IMG 20251024 WA0102

IMG 20251024 WA0100

ఎల్లారెడ్డి, అక్టోబర్‌ 24 (ప్రశ్న ఆయుధం):

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేద ప్రజల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ మరో ప్రజారంజక అడుగు వేశారు. ఈరోజు వెల్లుట్ల మరియు అన్నసాగర్ గ్రామాల్లో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ – “గ్రామ ప్రజల ఆరోగ్యమే గ్రామ అభివృద్ధికి మూలం. పేదలకు అందుబాటులో నాణ్యమైన వైద్యం అందించడమే నా కర్తవ్యం” అని స్పష్టం చేశారు. ఈ ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేస్తాయని, ప్రతి పౌరుడు ఈ సేవలను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

తరువాత వైద్య సిబ్బందితో సమావేశమై, సేవా దృక్పథంతో పేదలకు శ్రద్ధతో వైద్య సేవలు అందించాలంటూ సూచించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ప్రజా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని, గ్రామీణ అభివృద్ధి దిశగా ప్రతి అడుగు ప్రజల కోసం వేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో డియంహెచ్వో, ఏఎన్ఎంలు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, వెల్లుట్ల గ్రామ కాంగ్రెస్‌ నాయకులు, మండల సీనియర్‌ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల సానుకూల స్పందన:

వెళ్లుట్ల మరియు అన్నసాగర్ గ్రామవాసులు కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు . “ఇలాంటి వైద్య సదుపాయాలు గ్రామానికి చాలా అవసరం. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడం వల్ల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి” అని వారు తెలిపారు.

స్థానికులు ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రామ అభివృద్ధి కోసం ఆయన చూపిన అంకితభావాన్ని ప్రశంసిస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Exit mobile version