ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 20, (పశ్న ఆయుధం):
ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి అనారోగ్యంతో బాధపడటంతో పరిశీలించిన వైద్యులు ఆపరేషన్ తప్పనిసరి అని సూచించారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబం ఎమ్మెల్యే మదన్ మోహన్ ను సంప్రదించగా, ఆయన వెంటనే స్పందించి 2.50 లక్షల రూపాయల LOC (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా చికిత్స నిమిత్తం మద్దతు అందించారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ చర్యతో తన నియోజకవర్గంలోని పేద మరియు సమస్యలతో ఉన్న ప్రజల పక్కన ఉన్నట్టు మరోసారి స్పష్టం అవుతుంది. ఈ తక్షణ సహాయం లక్ష్మారెడ్డి కుటుంబానికి పెద్ద ఉపశమనం అయ్యింది.