గాదె తిరుపతిని అభినందించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 8
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నియమితులైన, గాదె తిరుపతిని, మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు అభినందించారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో గాదె తిరుపతి ఎమ్మెల్యే మదన్మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన గాయత్రిని శాలువాతో సన్మానించి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పేషెటి లక్ష్మీనారాయణ జక్కుల సంతోష్ పాల్గొన్నారు.