ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినా ఎమ్మెల్యేల పై ధ్వజమెత్తిన
ఎంఎల్ఏ మాధవరం కృష్ణ రావు
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 26: కూకట్‌పల్లి ప్రతినిధి
ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అని కూకట్ పల్లి ఎంఎల్ఏ మాధవరం కృష్ణ రావు ధ్వజమెత్తారు..గురువారం ఆయన క్యాంపు కార్యాలయం లో మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు
శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా కనీసం ఏం మాట్లాడుతున్నాం అని విజ్ఞత కోల్పోవడం చాలా దురదృష్ట కరమని అన్నారు.
సినీ పరిశ్రమ ను చెన్నారెడ్డి తమిళ నాడు నుండి హైదారాబాద్ నగరానికి తీసుకొచ్చారు అని గుర్తు చేశారు. హైద్రాబాద్ మహా నగరంలో
సినీ పరిశ్రమ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అని అందరూ మన బిడ్డలే అని దయచేసి ఆంధ్ర, తెలంగాణ అనే భావం తేవద్దు అని హితవు పలికారు.
హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతత కోరుకొంటున్నారు.
నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయిన మాట్లాడితే ఊరుకునేది లేదు అని ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు హెచ్చరించారు.