Site icon PRASHNA AYUDHAM

కె పి హెచ్ బి కాలనీ రోడ్ నెంబర్ వన్ లో ఉన్న దోబిఘాట్ ని పరిశీలించిన.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

IMG 20241230 WA0033

కె పి హెచ్ బి కాలనీ రోడ్ నెంబర్ వన్ లో ఉన్న దోబిఘాట్ ని పరిశీలించిన

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రశ్న ఆయుధం డిసెంబర్ 30: కూకట్‌పల్లి ప్రతినిధి

బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కె పి హెచ్ బి కాలనీ రోడ్ నెంబర్ వన్ లో ఉన్న దోబిఘాట్ ని కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు తో మరియు అధికారులతో కలిసి పరిశీలించారు.

సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దోబిఘాట్ ను అత్యాధునిక హంగులతో మోడ్రన్ దోబిఘాట్ గా తీర్చిదిద్దేందుకు తలపెట్టిన పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని నాయి బ్రాహ్మణ సంఘ భవనం అభివృద్ధి నిర్మాణ పనులను మరియు నాల (రిటైనింగ్ వాల్) ప్రహరీ గోడ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డిఈ శంకర్ , ఏఈ శ్రీనివాస్ , రజక సంఘం సభ్యులు, నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version