బస్తీ దవాఖానాను ఆకస్మిక తనిఖి….ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ప్రశ్న ఆయుధం, అక్టోబరు 21: కూకట్‌పల్లి ప్రతినిధి
మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ జనతానగర్ లోని బస్తీ దవాఖానాను పరిశీలించారు. బస్తీ దవాఖానాలో ప్రజలకు కావాల్సిన మందులు అందుబాటులో లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.అలాగే ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా అందడం లేదని,వెంటనే ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో కావాల్సినవి అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందుబాటులోకి బస్తీ దవాఖానాలు తీసుకొచ్చారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీస మౌలిక సదుపాయాలు కూడా లేకుండా గాలికి వదిలేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పై ఉన్న చిత్తశుద్ధి ఏంటో కళ్ళకు కట్టినట్లు కనబడుతుందని ఇప్పటికైనా మేల్కొని నిరుపేదలకు ఉపయోగపడే బస్తీ దవాఖానాలు విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు,మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, పగుడాల బాబురావు,అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్,అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.