ఫుట్ పాతులపై జీవనం సాగిస్తున్న నిరుపేదల పట్ల జిహెచ్ఎంసి అధికారులు ట్రాఫిక్ పోలీసుల చర్య అమానుషం – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 25: కూకట్‌పల్లి ప్రతినిధి
ఎన్నో సంవత్సరాలుగా ఫుట్ పాతులపై జీవనం సాగిస్తున్న నిరుపేదల పట్ల జిహెచ్ఎంసి అధికారులు ట్రాఫిక్ పోలీసులు, నిరుపేదలు ఏర్పరచుకున్న డబ్బాలను తొలగించడం దౌర్భాగ్యమైన చర్యలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కెపిహెచ్బి కాలనీ 9 వ ఫెజ్ నుండి 5 వ ఫేజ్ వరకు ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి తొలగించడం బాధాకరమని అన్నారు.రోడ్డుపై వ్యాపారం చేసుకొని బ్రతికే నిరుపేదల జోలికి వస్తే సహించే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు , మాజీ కార్పొరేటర్ బాబురావు,సాయిబాబా చౌదరి, తదితరులు పాల్గొన్నారు.