Site icon PRASHNA AYUDHAM

కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా..!

కార్యకర్తలకు
Headlines :

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన

కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు వచ్చిన అండగా ఉంటానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

ప్రశ్న ఆయుధం నవంబర్ 03: కూకట్‌పల్లి ప్రతినిధి

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించిన కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు వచ్చిన అండగా ఉంటానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారంనాడు మూసాపేట డివిజన్ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో స్థానిక మాజీ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్యకర్తలు డివిజన్లో అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న అరాచకాలను మరియు హైడ్రా పేరుతో ప్రజలను అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు హైడ్రా పేరును అడ్డుపెట్టుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా వందల కోట్ల రూపాయలతో మూసాపేట డివిజన్ ను అభివృద్ధి చేశామని రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సమస్యలు ట్రాఫిక్ సమస్యలు నిర్మూలన చేపట్టామన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన నుండి నియోజకవర్గానికి ఒక్క రూపాయి బడ్జెట్ కూడా ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంట్లుపడిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఏమైనా న్యాయం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బిజెపి పార్టీలు కుమ్మక్కై బిఆర్ఎస్ పార్టీని తిట్టడమే లక్ష్యంగా చేసుకున్నారు తప్ప అభివృద్ధి పైన దృష్టిసారించే ఆలోచన లేదన్నారు. పెద్దోళ్ల భవంతులను కూల్చడం మానేసి పేదోళ్ల కడుపులు కొట్టడానికి హైడ్రా తీసుకువచ్చారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఎలాంటి ఆపదలు వచ్చినా వెన్నంటి ఉంటానని ఎవరు కూడా భయభ్రాంతులకు గురికాకూడదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సత్యనారాయణ, జిల్లా గోపాల్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version