శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థులను అభినందించిన
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ప్రశ్న ఆయుధం జూలై 14: కూకట్‌పల్లి ప్రతినిధి
శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థులను యం.ఎల్. ఎ మాధవరం కృష్ణారావు అభినందించారు. సర్దార్ పటేల్ నగర్ శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల లో చదువుతున్న పలువురు విద్యార్థులు అంతరిక్ష వైజ్ఞానిక యాత్ర( నాసా యు ఎస్ ఎ) ను విజయవంతంగా పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన సందర్భంగా యం.ఎల్. ఎ మాధవరం కృష్ణారావు ని కలిసి విద్యార్థులు ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణారావు విద్యార్థులు సాయి లహరిక, శ్యామ్ స్వరూప్ లను సత్కరించారు.అనంతరం యం.ఎల్. ఎ మాట్లాడుతూ అంతరిక్ష వైజ్ఞానిక యాత్ర గురించి మాట్లాడుతూ పిల్లలలో విజ్ఞానపరంగా అభివృద్ధి సాధించడానికి ఇది ఒక చక్కని అవకాశం అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులను ప్రోత్సహించి పంపినందుకు తల్లిదండ్రులను,నాసా ఇంచార్జీ నీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మి , సుభాషిణి , ఎ జి ఎం శివరామకృష్ణ, ఆర్ ఐ పద్మజ, కో ఆర్డినేటర్స్ మురళీకృష్ణ ,వేంకటశివ ,డీన్ మరియు ఇంచార్జి లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
by Madda Anil
Published On: July 14, 2025 7:43 pm