ఆదివారం రోజు జరగబోయే బోనాల ఏర్పాట్ల గురించి అధికారులను ఆదేశించిన
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ప్రశ్న ఆయుధం జులై16: కూకట్‌పల్లి ప్రతినిధి
ఆదివారం నాడు చిత్తరమ్మ దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మంచినీళ్ల ఏర్పాట్లు కరెంటు సమస్య తలెత్తకుండ చూడాలని అదేవిధంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీస్ శాఖ వారు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 5 గంటల నుండి భక్తులందరూ ఆలయానికి రావడం మొదలవుతుంది కాబట్టి ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లన్నీ త్వరగా పూర్తిచేయాలని జిహెచ్ఎంసి వారు శానిటేషన్ సిబ్బందిని అందుబాటులో ఉంచుకొని ఆలయ ప్రాంగణంలో శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఆలయ ఈవో, జిహెచ్ఎంసి అధికారులు, విద్యుత్ అధికారులు, పోలీస్ అధికారులు, పాల్గొన్నారు.