ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను
త్రోసిపుచ్చిన తూము వేణు
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 23: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వం బి ఆర్ ఎస్ పార్టీ దేనని, కాంగ్రెస్ పార్టీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు త్రోసిపుచ్చారు. గడిచిన 10 సంవత్సరాల బి ఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి దోపిడీ పాలనను కొనసాగించింది, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రజలను మోసగించి ఓట్లు దండుకొని రెండుసార్లు అధికారం చేపట్టింది వాస్తవం కదా అని నిలదీశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువ శక్తిని నిర్వీర్యం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. అభివృద్ధి పేరిట అప్పులు చేసి కాంట్రాక్టుల పేరిట కమిషన్లు కొట్టేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన
బి ఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాని , నాయకులకి గాని కాంగ్రెస్, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు గాని అధికారులకు గాని ఎమ్మెల్యేలకు గాని అందుబాటులో ఉండేవారు కాదని, కనీసం ఫోన్లో కూడా కేసీఆర్ తో మాట్లాడే అవకాశం ఎమ్మెల్యేలకు ఉండేది కాదని తూము వేణు గుర్తు చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన చేస్తున్న తరుణంలో మూడుసార్లు మాధవరావు కృష్ణారావు ఎమ్మెల్యే హోదా లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి అభివృద్ధికి నిధులు అడిగిన సందర్భాలు ప్రజలందరికీ తెలుసు అని తెలియజేశారు.
బి ఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కి సమాధానం చెప్పే ధైర్యం లేకనే కేసీఆర్ అసెంబ్లీ కి హాజరుకాకుండా ఇంట్లో పండుకుంటున్నాడు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కనుసన్నలలో జరిగిన చెరువుల కబ్జాలు, అక్రమ కట్టడాల వలన వాతావరణ సమతుల్యత లోపించి తెలంగాణ రాష్ట్రంలో జలవనరులు తరిగిపోయాయి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని మైసమ్మ చెరువు మాయమైపోయిందని ,
కాముని చెరువు కనిపించకుండా పోయిందని, సున్నంచెరువు చిక్కిపోయి , రంగధాముని చెరువు రాబందుల పాలయ్యిందని తూము వేణు అన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి చిత్తశుద్ధి ఉంటే *మన ఊరు మన చెరువు*అనే అంశం ప్రధానంగా బహిరంగ చర్చకు రావాలి అని వేణు సవాలు చేశారు. ఎన్నికలలో పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెట్టే సామర్థ్యం కోల్పో పోయిన బి ఆర్ ఎస్ పార్టీ తిరిగి అధికరం లోకి వస్తుంది అనే పగటికలలు కనటం మానుకోవాలని హితవు పలికారు.
అబ్దుల్ కలాం కలలు కనమన్నారు, ఆ కలలు సాకారం చేసుకోమన్నారు గాని, పగటి కలలు కనమని చెప్పలేదు అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కి తూము వేణు గుర్తుచేశారు.