Site icon PRASHNA AYUDHAM

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కువినతి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ 

IMG 20250422 WA2570

చెరువుల అభివృద్ధి కొరకు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కువినతి పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ కుమార్

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 22: కూకట్‌పల్లి ప్రతినిధి

బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే కొన్ని చెరువులను అభివృద్ధి చేశమని కూకట్ పల్లి నియోజకవర్గంలో మిగిలిన చెరువులను అభివృద్ధి చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 చెరువులు రెండు కుంటలు కాజ కుంట, హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి కుంటలను అభివృద్ధి చేయాలని అందులో ఐడీఎల్ చెరువు, బోయిన చెరువును, ములకత్వ చెరువు నల్ల చెరువులో కొంత భాగం సుందరీకరణం చేశామని వాటిపై కోర్టులో కేసులు ఉండటం వలన పూర్తిగా అభివృద్ధి జరగలేదని దానిపై కమిషనర్ న్యాయస్థానం ద్వారా వివరాలను సేకరించి నియోజకవర్గంలో మిగిలిన చెరువులను సుందరీకరణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూయజమానులు కావచ్చు మరియు కొనుగోలు చేసిన వారు కావచ్చు ఎవరైనా వారికి టీడీపీ నుంచి అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. భూ యజమానులకు టిడిఆర్ ఇచ్చే సమయంలో వారి దగ్గర కొనుగోలుదారులు ఎవరో అమ్మిన వారెవరో నిజ నిజాలు తెలుసుకొని వారికి టిడిఆర్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెరువులను అభివృద్ధి చేసే సమయంలో నల్లచెరువు ఐడియల్ చెరువు లాంటి వాటికి నాల డైవర్షన్ ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు ఆలస్యం జరుగకుండా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే హైడ్రా కమిషనర్ రంగనాథుని కోరారు. అదేవిధంగా నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధి చేసే సమయంలో పార్టీలకు అతీతంగా ఎవరైనా కబ్జాలకు పాల్పడినా వారిపైన చర్యలు తీసుకోవాలి తప్ప అభివృద్ధిలో మాత్రం ఎక్కడ జాప్యం జరగకుండా పనులు చేయాలన్నారు. వినతి పత్రాన్ని స్వీకరించిన అనంతరం హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందించి అతి త్వరలోనే అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి భూ యజమానులకు కొనుగోలుదారుల వివరాలను సేకరించి టిడిఆర్ ఇప్పించి అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.

అదేవిధంగా అమృత నగర్ తాండవాసులు వర్షాలు వస్తే మునిగిపోయి డ్రైనేజ్ నీరు ఇండ్లలోకి వచ్చే ప్రాంతంలో ఉన్నటువంటి తాండావాసులకు ఇప్పటికే 70 మంది కుటుంబాలకు గత ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పించమని పెండింగ్ లో ఉన్నటువంటి 60 మంది నిరుపేదలకు కైతలాపూర్ లోని డబల్ బెడ్ రూములు ఇప్పించి నిరుపేదల కుటుంబాల ఆరోగ్యలను కాపాడే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోరారు.

Exit mobile version