కమ్యూనిటీ హాల్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 08: కూకట్‌పల్లి ప్రతినిధి
యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ టి మహేశ్వరి శ్రీహరి వారితో బేగంపేట్ డివిజన్ ఎరుకల బస్తి లో కమ్యూనిటీ హాల్ పనులు పరిశీలించి పనులు పూర్తి అయినందున కమ్యూనిటీ హాల్ ని స్థానికులకు అప్పగించారు
అనంతరం ప్రకాష్ నగర్ రోడ్డు పరిశీలించి పెండింగ్‌లో ఉన్న సిసి రోడ్డు పనులను త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు.
అనంతరం ఖార్డు సంస్ధ వ్యస్థాపకులు సుమన్ మల్లాది, మంజులత ఆధ్వర్యంలో బ్రాహ్మణవాడి రామానంద మెమోరియల్ సెంటర్ లో 40 మంది మహిళలకు శిక్షణా కేంద్రం లో శిక్షణా పూర్తి అయినా వారి కి కుట్టు మెషిన్స్ యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , యమ ఎల్ సి వాణి దేవి చేతుల మీదుగా అందచేశారు.
ఈ కార్యక్రములో డివిజన్ అధ్యక్షుడు పి సురేష్ కుమార్ యాదవ్ , నరేష్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.