ఘట్కేసర్‌లో నాభి శిలా ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి

**ఘట్కేసర్‌లో నాభి శిలా ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి**

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రశ్న ఆయుధం మే 17

IMG 20250517 WA2444

నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన నాభి శిలా ప్రతిష్ఠ (బొడ్రాయి) కార్యక్రమంలో భాగంగా శనివారం పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మల్లారెడ్డికి ఆశీర్వచనాలు అందజేసి, తీర్థప్రసాదాలు అందించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.ప్రముఖుల మద్దతుతో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ, “ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామీణ ప్రజల్లో ఐకమత్యాన్ని, భక్తి భావాన్ని పెంపొందిస్తాయి. గ్రామ అభివృద్ధి మరియు సమాజ శాంతికోసం ఇవి ఎంతో అవసరం” అని తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో నిండిపోయింది. గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.

Join WhatsApp

Join Now